అడవిలో అగ్ని ప్రమాదాలను నివారించాలి
కాసిపేట: అడవిలో అగ్ని ప్రమాదాలను నివారించాలని అటవీశాఖ డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్ సూచించారు. మంగళవారం మండలంలోని ముత్యంపల్లి, ధర్మరావుపేట సెక్షన్ల పరిధిలో మామిడిగూడ, పెద్దధర్మారం, బుగ్గగూడ, చింతగూడ, గురువాపూర్ గ్రామాల్లో అడవిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అటవీ రక్షణలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఫైర్‌లైన్‌లు చేస్తూ.. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్‌బ్లోయర్లతో నిప్పు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నష్టం పెద్దగా జరుగుతోందని చెప్పారు. వన్యప్రాణుల ఆవాసం చెదిరి విలువైన వృక్ష సంపద కనుమరుగవుతోందని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తెస్తే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని తెలిపా రు. పశువుల కాపరులు తమవెంట గొడ్డళ్లు తీసుకువెళ్లరాదని, చిన్నచిన్న చెట్లను మేతకు నరికితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఎఫ్‌బీవోలు శ్రీధర్, యుగేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment