పెండింగ్ బిల్లుల పంచాయతీ
● ప్రజావాణిలో నిరసన తెలిపిన సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు విడుదల చేయాలని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రాంగణంలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సర్పంచులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజావాణి నిర్వహించే కార్యాలయం వైపు ఒక్కసారిగా దూసుకెళ్లారు. కలెక్టర్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు బిల్లులు చెల్లించి మాజీ సర్పంచులను అప్పుల ఊబి నుంచి బయటపడేలా ఆదుకోవాలని కోరారు. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గత నవంబర్ 27న పెంబి సర్పంచ్ పూర్ణచందర్‌గౌడ్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశాడని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment