మంచిర్యాలకు చేరుకున్న హ్యాండ్‌బాల్ ఉమ్మడి జిల్లా జట్టు
మంచిర్యాలటౌన్: గత నెల 29న నుంచి ఈ నెల 1వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన 46వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు చాంపియన్‌గా నిలిచింది. సోమవారం మంచిర్యాలకు విచ్చేసిన జట్టుకు ఉమ్మడి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్‌రావు, కార్యదర్శి కనపర్తి రమేశ్ ఘన స్వాగతం పలికారు. రంగారెడ్డి జట్టుతో సెమీఫైనల్‌లో తలపడి 17–05 గోల్స్ తేడాతో గెలుపొంది, ఫైనల్‌లో మహబూబ్‌నగర్ జిల్లాతో పోరాడి 21–14 గోల్స్ తేడాతో చిత్తుచేసి రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment