న్యూస్‌రీల్‌ | - | Sakshi
Sakshi News home page

న్యూస్‌రీల్‌

Published Wed, Jan 1 2025 12:13 AM | Last Updated on Wed, Jan 1 2025 12:13 AM

-

పైడిపెల్లి బీట్‌ అధికారి సస్పెన్షన్‌

జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌లోని పైడిపెల్లి బీట్‌ అధికారి తన్వీర్‌ పాషాను సస్పెండ్‌ చేస్తూ డీఎఫ్‌వో శివ్‌ ఆశిష్‌ సింగ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రేంజ్‌ అధికారి సుష్మారావు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, శా ఖ పరమైన పనుల్లో జాప్యం ప్రదర్శించిన కా రణంగా సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. గోండుగూడ బీట్‌ అధికారి లాల్‌బాయి కి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

2 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్‌

బెల్లంపల్లి: బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో ఈ నెల 2 నుంచి 5వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌. భాస్కర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాండూర్‌ మండలం రేపల్లెవాడ జిన్నింగ్‌ మిల్లులో పత్తి నిల్వలు అధికంగా పేరుకుపోయాయన్నారు. ఈనెల 6 నుంచి కొనుగోళ్లు పునఃప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement