బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాలి
● రామగుండం సీపీ శ్రీనివాస్
మంచిరాల్యక్రైం: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గురువారం కమిషనరేట్ ఆవరణలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్, కార్మిక శాఖ, ఐసీడీఎస్, చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ, ఎన్‌జీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ నెల 1నుంచి 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీస్, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ అధికారి తమవంతు బాధ్యతగా ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయాలని సూచించారు. ఇళ్లు, హోటళ్లు, కర్మాగారాలు, ఇటుక బట్టీల్లో బాలలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న యజమానులపై కేసులు నమోదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ రాజు, ఏసీపీ మల్లారెడ్డి, సీఐ రమేష్‌బాబు, ఎస్సై రాజేష్, శైలజ, లచ్చన్న, శరణ్య, కార్యిక శాఖ, ఐసీడీఎస్ చైల్డ్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment