7 క్వింటాళ్ల స్క్రాప్ పట్టివేత
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని మూడవ జోన్‌లో సింగరేణికి సంబంధించిన సుమారు 7 క్వింటాళ్ల విలువైన ఇనుప సామగ్రిని పట్టుకున్నట్లు ఏరియా సెక్యూరిటీ అధికారి నగునూరి రవి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం పలు స్క్రాప్ దుకాణాల్లో తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు వాహనంపై ఇనుప సామగ్రి తరలిస్తూ కనిపించడంతో వెంబడించారు. గమనించిన సదరు యువకులు ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలిపరారయ్యారు. సామగ్రి, బైక్‌ను స్వాధీనం చేసుకుని ఎస్‌అండ్‌పీసీ కార్యాలయానికి తరలించారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి ఏరియాలోని వర్క్‌షాపులో చోరీకి యత్నించినట్లు సమాచారం.
చోరీకి పాల్పడుతున్న ఒకరు అరెస్ట్
నిర్మల్‌టౌన్: పట్టణంలోని వివిధ షాపుల్లో చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిర్మల్‌రూరల్ మండలం భాగ్యనగర్, న్యూ పోచంపాడ్ గ్రామానికి చెందిన ముప్కాల రాకేష్‌రెడ్డి గత సంవత్సరం నవంబర్‌లో పట్టణంలోని హనుమాన్ మందిరంలో చోరీకి పాల్పడగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు రాగా ఈనెల 1న నిర్మల్ బస్టాండ్ ఏరియాలో చోరీకి యత్నిస్తుండగా కూరగాయల వ్యాపారి సయ్యద్ యూసుఫ్ పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment