పనిచేయని పరికరాలు..
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిఽ దిలో 22 వార్డులుండగా ఇప్పటివరకు 17 ఓపెన్‌జిమ్‌లు ఏర్పాటుచేశారు. మరికొన్ని వార్డుల్లో స్థలాలు అందుబాటులో లేక జిమ్‌లు ఏర్పాటుచేయలేదు. సుమారు రూ.కోటి 50 లక్షలతో ఈ పదిహేడు జిమ్‌లను ఏర్పాటుచేశారు. ఓపెన్‌జిమ్‌ల నిర్వహణ బాగానే ఉన్నప్పటికీ పలుచోట్ల వ్యాయామ పరికరాలు పనిచేయటం లేదు. స్థానిక ఠాగూర్ స్టేడియం, టోని ఫంక్షన్ హాల్, బీజోన్ ఏరియాలో ఏర్పాటుచేసిన జిమ్‌లలో కొన్ని వ్యాయామ వస్తువులు దెబ్బతిన్నాయి. దీంతో వ్యాయామం కోసం వచ్చినవారు అసౌకర్యానికి గురవుతున్నారు. జిమ్‌లను ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్‌తోనే పరికరాల మరమ్మతులు చేయిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రాజు, ఏఈ అచ్యుత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment