భూములు లాక్కుంటే ఊరుకోం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఇండస్ట్రియల్ కారి డార్, ఐటీ హబ్ పేరుతో దళిత, నిరుపేదల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. భూములు కోల్పోతున్న బాధితులను మంగళవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హాజీపూర్ మండలంలోని పోచంపాడు, ముల్కల్ల, కొత్తపల్లి, వేంపల్లి గ్రామాల్లో దాదాపు 276 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కా రిడార్, ఐటీ హబ్ ఏర్పాటుకు ఎలాంటి నోటిఫికేష న్ లేదా జీవో గాని తీసుకురాకుండా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో బా ధితులను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కు తరలించి అనధికారికంగా అధికారులతో సమావేశమై పేదల భూములు లాక్కోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. భూముల విలువ ఎకరాకు రూ.కోటి వరకు ఉండగా రూ.13 లక్షల విలువ ఎ లా ఇస్తారని ప్రశ్నించారు. పేదల భూములను దౌర్జన్యంగా తీసుకుంటే బాధితుల పక్షాన పోరాడతామ ని చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బెదరింపు రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని మించిపోతున్నారని ఆరోపించారు. ఐటీ, ఇండస్ట్రియల్ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, భూ సేకరణలో బాధితులకు మార్కెట్ ధర మేరకే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లగచర్ల స్ఫూర్తితో బాధితుల పక్షాన పోరాడుతా మని స్పష్టం చేశారు. అనంతరం మంచిర్యాల మా జీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో నిరుపేదలకు భూములు అ ప్పగిస్తే.. కాంగ్రెస్ ఆ భూములను దౌర్జన్యంగా లా క్కుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ దౌర్జన్యాన్ని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. వారి వెంట బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు.
● బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment