స్వచ్ఛందంగానే భూములిస్తున్నారు
మంచిర్యాలటౌన్: జిల్లాలోని వేంపల్లి గ్రామంలో ఇండస్ట్రియల్ హబ్ కోసం వేంపల్లి, ముల్కల్లకు చెందిన పలువురు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని, ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుతో పారిశ్రామికంగా ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో మంగళవా రం వేంపల్లి, ముల్కల్లకు చెందిన భూయజమానులతో సమావేశమయ్యారు. స్వచ్ఛందంగా భూ ములిచ్చేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలి పారు. భూములిచ్చినవారికి నెలలోపు పరిహారం వచ్చేలా చూస్తానని భరోసానిచ్చారు. ఎకరాకు రూ.14.50 లక్షలు పరిహారంగా ఇవ్వడంతో పాటు దసరా నాటికి అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటు అనంతరం భూనిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగావకాశాలను కల్పిస్తామని చెప్పారు. దళారులను న మ్మి మోసపోవద్దని సూచించారు. ఎల్లంపల్లి నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందలేదనే విషయం అందరికీ తెలిసిందేనని, పారిశ్రామిక రంగం అభివృద్ధి విషయంలో ఎవరు అడ్డుపడినా సహించబో మని హెచ్చరించారు. విపక్షాలు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా ప్ర జలకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ మతం పేరిట జపం చేస్తోందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసి తీరుతానని, మాట తప్పితే రాజీనామా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలోని గోదావరినది తీరాన మహాప్రస్థానం నిర్మాణ పనులు పరిశీలించి, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment