మెరుగైన వైద్య సేవలందించాలి
● ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ● అభివృద్ధి పనులకు భూమిపూజ
చెన్నూర్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ట్లు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. స్థానిక పాత మార్కెట్ కార్యాలయ ఆవరణలో రూ.1.30 కోట్లతో చేపట్టిన పీహెచ్‌సీ, తహసీల్దార్ కార్యాలయ సమీపంలో రూ.20 లక్షలతో చేపట్టిన అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు ఆయన మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో నేతకాని, ము దిరాజ్ కమ్యూనిటీ హాళ్లు నిర్మించనున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బెల్లంకొండ కరుణసాగర్‌రావు, తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజ్, కమిషనర్ మురళీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు తగరం వెంకటి, బషీరొద్దీ న్, సూర్యనారాయణ తదితరులున్నారు.
మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
కోటపల్లి: మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చా రు. మండలంలోని నక్కలపల్లి, మల్లంపేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులతోపాటు కోటపల్లిలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. రూ.15లక్షలతో నక్కలపల్లి తోతొర్రె వాగుపై నిర్మించిన లోలెవల్ వంతెనను కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్కలపల్లి గ్రామ రోడ్డు నిర్మాణం అటవీ అనుమతులు లేక నిలిచిపోగా త్వరలోనే పనులు ప్రారంభించేలా కలెక్టర్‌తో మాట్లాడి 55 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నక్కలపల్లి రహదారికి త్వరలోనే నిధులు మంజూరు చేసి బీటీ రోడ్డు పనులు ప్రారంభించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ సర్పంచులు, అధికారులు, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ సుధాకర్, ఎస్సై రాజేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment