‘ఉత్పత్తికి మూడునెలలే కీలకం’
శ్రీరాంపూర్: వార్షిక ఉత్పత్తి లక్ష్యసాధనకు ఈ మూడు నెలలే కీలకమని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) జీ వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎల్వీ సూర్యనారాయణతో కలిసి శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ గనిని సందర్శించారు. ఈ సందర్భంగా వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలను పరిశీలించారు. అనంతరం క్వారీలోకి దిగారు. కోల్‌బెంచీలు, ఆఫ్ లోడింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్పత్తిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్చి 31నాటికి ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, ఈ లోపు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఉత్పత్తి పెంపుదల కోసం పక్కా ప్రణాళికలు రూపొందించి వాటి అమలుకు కృషి చేయాలని చెప్పారు. బొగ్గు ఉత్పత్తితోపాటు రక్షణకూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూనే లోటు ఉత్పత్తినీ పూడ్చుకోవడానికి తగినచర్యలు చేపట్టాలని తెలిపారు. ఓబీ పనులు నిర్వహించే జీవీఆ ర్, సీఆర్‌ఆర్ కాంట్రాక్టర్ ప్రతినిధులతోనూ చర్చించి నిర్దేశించిన ఓబీ వెలికితీయాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి అధికారులంతా కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎస్సార్పీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి టీ శ్రీనివాస్, ఇందారం ప్రాజెక్ట్ అధికారి ఏవీ రెడ్డి, గని మేనేజర్ బ్రహ్మాజీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ నాగరాజు, సర్వే అధికారి సంపత్ పాల్గొన్నారు.
ప్రణాళికతో లక్ష్యాన్ని సాధించాలి
జైపూర్: నిర్దేశిత లక్ష్య సాధనకు తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) జీ వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. మండలంలోని ఇందారం ఐకే ఓసీపీ ప్రాజెక్ట్‌ను ఆయన శ్రీరాంపూర్ జీఎం సూర్యనారాయణతో కలిసి సందర్శించారు. ఓసీపీ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి, నిల్వలను పరిశీలించి లక్ష్యాలపై అధికారులు, సిబ్బందికి మా ర్గనిర్దేశం చేశారు. మూడునెలల్లో తప్పనిసరిగా నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంత రం అధికారులతో చర్చించారు. క్వారీలోకి వెళ్లి కోల్ బెంచ్‌లు, ఆఫ్ లోడిండ్ ప్రదేశాలను పరిశీలించారు. ఉత్పత్తి పెంపుదలకు తగిన సూచనలు చేశారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని చెప్పారు. వరా హా ఓబీ కాంట్రాక్ట్ కంపెనీ నిర్దేశించిన రోజువారీ లక్ష్యం సాధించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఐకే ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి ఏవీరెడ్డి, ప్రాజెక్ట్ ఇంజినీర్ రామకృష్ణారావు, సేఫ్టీ అధికారి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment