రైతు భరోసా అమలు చేయాలని పోస్టర్లు
చెన్నూర్‌రూరల్: కొర్రీలు లేకుండా ప్రభుత్వం రైతు భరోసా అమలు చేయాలని మండలంలోని కొమ్మెర రైతులు శనివారం రాత్రి ఊరూరా పోస్టర్లను అంటించారు. ఎకరానికి రూ.17,500 చొప్పున రైతులకు బాకి పడ్డ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
మందమర్రివాసికి బహుజన సాహిత్య అకాడమీ అవార్డు
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి టెంపుల్ ఏరియాకు చెందిన దాసరి శ్రావణ్‌కుమార్‌కు బహుజన సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 8వ తెలంగాణ రాష్ట్ర అకాడమీ కాన్ఫరెన్స్‌లో అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లాల రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ తాను చేస్తున్న సమాజసేవను అకాడమీ గుర్తించి అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment