● రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్
మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిఽధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాలో చైనా మాంజా ఎవరైన విక్రయించినా, విని యోగించినా కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ ఎం.శ్రీనివాసులు హెచ్చరించారు. గాలి పటాలు ఎగురవేసేందుకు కొందరు చైనా మాంజా ఉపయోగిస్తున్నారని తెలిపారు. చైనా మాంజా ఉపయోగించేవారు ఎంతటి వారైన సరే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం1986 ప్రకారం చైనా మాంజా విక్రయించిన వారికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment