సమస్యలు ఆలకించి.. అర్జీలు స్వీకరించి..
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణతో కలిసి సోమవారం అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలు ఆలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు.
● నెన్నెల మండలం పొట్యాల గ్రామానికి చెందిన తిరుమలేశ్, అర్క నారాయణ పొట్యాల్, కొంపల్లి గ్రామాలలో దాదాపు 300 జనాభా ఉందని, ప్రజల సౌకర్యార్థం గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు.
● భీమిని మండలం పెద్దపేట గ్రామానికి చెందిన అరికిల విజయ తాను కూలీ పని చేసుకుంటూ తడకల ఇంటిలో నివసిస్తున్నామని, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.
● తాండూర్ మండలం అచ్చలాపూర్ గ్రామానికి చెందిన జాడి పెంటయ్య తన వ్యవసాయ భూమి నల్లవాగు ప్రాజెక్టులో ముంపునకు గురయిందని పరిహారం అందించాలని కోరారు.
● వేమనపల్లి మండలం దస్నాపూర్ గ్రామానికి చెందిన గురుండ్ల చంద్రుమెర గొర్లపల్లి గ్రామ శివారులోని తన భూమి ఆర్‌ఆండ్‌ఆర్ కొత్త కాలనీలో పోయినట్లుగా చూపుతుందని, ఎలాంటి భూ సేకరణ జరుగలేదని ఫిర్యాదు చేశారు.
● ది నేషనల్ అంబేద్కర్ సేవ సంస్థ ప్రతినిధులు మందమర్రిలో వైద్య కళాశాల, డిగ్రీ కళాశాలలు మంజూరు చేయాలని వినతిపత్రం అంజేశారు.
Comments
Please login to add a commentAdd a comment