పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో ఈ నెల 09 నుంచి నిర్వహించే సదరం వైద్య శిబిరాలను సద్వినియో గం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధి కారి ఎస్.కిషన్ సూచించారు. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని సదరం శిబిరానికి హాజరు కావాలన్నారు. సదరం సర్టిఫికెట్ కాలపరిమితి ముగిసినవారు సకాలంలో రెన్యూవల్ చేయించుకోవాలన్నా రు. సదరం శిబిరాల వివరాలు ఈ నెల 09, 17, 22, 30 తేదీల్లో శారీరక దివ్యాంగులు 60 మందికి, 20న మూగ, చెవుడు వైకల్యం ఉన్న 50 మందికి 24న కంటి చూపు సమస్యలు ఉన్నవారికి, 28న మానసిక దివ్యాంగులు 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment