రెండు తలల పామును తరలిస్తున్న ముఠా పట్టివేత
చెన్నూర్: రెండు తలల పామును తరలిస్తున్న ము ఠాను అటవీ అధికారులు మాటు వేసి పట్టుకున్నా రు. స్థానిక ఫారెస్ట్ కార్యాలయంలో బుధవారం ము ఠా వివరాలను ఫారెస్ట్ రేంజ్ అధికారి శివకుమార్ వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి చెన్నూర్ మీదుగా రెండు తలల పామును కొందరు వ్యక్తులు తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఈ నెల 6న చెన్నూర్ మండలం చింతలపల్లి గ్రామంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ కారులో రెండు తలల పాము ను గుర్తించారు. పాముతోపాటు కారు, మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన కదార్ల ధనుంజయ్, కోల్లూరు గ్రామానికి చెందిన కొరాళ్ల సంతోశ్, బోరంపల్లి గ్రామానికి చెందిన దుర్గం రాజ్‌గోపాల్, చెన్నూర్‌కు చెందిన వేమలు తిరుపతి, శ్రీరాంపూర్‌కు చెందిన కుంభం పోచిరెడ్డి, మహా రాష్ట్రలోని కొప్పుల గ్రామానికి చెందిన సుదర్శన్, ప్రభాకర్ ముఠాగా ఏర్పడి పామును తరలిస్తున్నారని విచారణలో తేలింది. ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామని తెలిపారు. సమావేశంలో అటవీ అధికారులు ప్రభాకర్, చంద్రమోహన్ పాల్గొన్నారు.
గుప్త నిధుల కోసం..!
రెండు తలల పాము గుప్త నిధులను పట్టిస్తుందని కొందరు నమ్ముతారు. దీంతో గుప్త నిధుల వేటగాళ్లు రెండు తలల పామును కొనుగోలు చేస్తారని తెలిసింది. ఈ పామును రూ.40 లక్షలకు అ మ్మేందుకు తరలిస్తుండగా పట్టుబడినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment