● రాష్ట్ర స్థాయి అండర్–13 బాలికల చాంపియన్‌షిప్ ● పాల్గొననున్న ఆయా జిల్లాల జట్లు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్‌లో తెలంగాణ స్థాయి బాలికల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు పోటీలు నిర్వహిస్తారు. ఖేలో ఇండియా గేమ్స్‌లో భాగంగా నిర్వహించే ఈ పోటీలకు తెలంగాణలోని ఆయా జిల్లాల జట్లు హాజరవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు స్థానిక ఠాగూర్‌స్టేడియం ముస్తాబైంది. ఉదయం పది గంటలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లాంఛనంగా పోటీలు ప్రారంభించనున్నారు.
పాల్గొనే జట్లు ఇవే...
తెలంగాణ(సౌత్‌జోన్) బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో రారష్ట్‌రం నుంచి మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నా యి. ఎలెవన్‌స్టార్ ఫుట్‌బాల్ అకాడమీ పేరిట ఆతి థ్య ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు, ట్విన్‌సిటీస్ హైదరాబాద్ జట్టు, తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జట్టు, కేర్ ఫుట్‌బాల్ అకాడమీ నిజామాబాద్ జట్టు, గజ్వేల్ ఫుట్‌బాల్ అకాడమీ సిద్దిపేట జట్టు, వుమెన్స్ ఫుట్‌బాల్ అకాడమీ(హైదరాబాద్, ఖమ్మం కంబైన్డ్) జట్లు పాల్గొంటాయి. లీగ్ పద్ధతిలో నిర్వహించనుండగా ఒక్కో జట్టు మిగతా ఐదు జట్లతో తలపడుతుంది. లీగ్ పోటీల్లో ప్రతిభ కనబరచి ఉత్తమంగా నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌లో తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment