పెన్‌గంగ దాటిన పులి
● పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు
ఆదిలాబాద్‌టౌన్: జైనథ్ మండలం కరంజి గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో పది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా అందులో ఎలాంటి ఆనవాళ్లు చిక్కలేదు. అయితే బుధవారం పెన్‌గంగ పరిసర ప్రాంతాల్లో పులి పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాబ్ సింగ్ తెలిపారు. పెన్‌గంగ దాటి మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే పంట చేలకు వెళ్లినప్పుడు గుంపులు గుంపులుగా, చప్పుడు చేసుకుంటూ వెళ్లాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment