సొంతింటి పథకం అమలు చేయాలి
శ్రీరాంపూర్: కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి పథకం అమలు చేయాలని సీఐటీయూ కేంద్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి యాజమాన్యం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. సింగరేణి స్థలాల్లో కార్మికులకు ఇంటి స్థలం ఇవ్వాలని అన్నారు. కంపెనీ కార్మికులకు కేటాయించిన క్వార్టర్లకు నెలకు రూ.5 వేలు నిర్వహణ వస్తుందని, కార్మికుడు కూడా క్వార్టర్‌లో ఉండడం వల్ల అలవెన్సులపై నెలకు రూ.3 వేల వరకు ఐటీ చెల్లించాల్సి వస్తుందని, హెచ్‌ఆర్‌ఏ కూడా కార్మికులకు మిగులుతుందని తెలిపారు. ఇలా ఒక్కో కార్మికుడు కంపెనీ క్వార్టర్‌లో కాకుండా ఇంటిస్థలం కేటాయిస్తే రూ.15 వేల వరకు ఆదా అవుతాయని అన్నారు. సింగరేణి క్వార్టర్లను కూల్చి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టాలని చూస్తే అడ్డుకుంటామని, పెండింగ్‌లో ఉన్న కార్మికుల మారుపేర్లను క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు నరహరిరావు, బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, నాయకులు కస్తూరి చంద్రశేఖర్, బానేష్, శ్రీనివాస్, సందీప్ కుమార్, రాజేష్, రాజబాబు, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment