● బెల్లంపల్లిలో ప్రక్రియ ప్రారంభించిన సింగరేణి ● కన్నాల
ఒప్పందం జరిగిందా..?
బెల్లంపల్లిలో సింగరేణి విద్యుత్ కనెక్షన్ల తొలగించడానికి గుట్టుగా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇటీవల ఓ ముఖ్య ప్రజా ప్రతినిధితో సింగరేణి అధికా రులు చర్చించినట్లు పుర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ మేరకు ముందస్తుగా డబుల్ విద్యుత్ కనెక్షన్లు ఉన్న క్వార్టర్లకు సింగరేణి కరెంట్ కనెక్షన్ తొలగిస్తున్నట్లు చేసి క్రమక్రమంగా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు ముఖ్యప్రజా ప్రతినిధి సానుకూలతను వ్యక్తం చేయడంతో సింగరేణి సీఅండ్‌ఎండీ నుంచి ఆదేశాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిసిటీ అధికారులు దూకుడును ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈవిషయమై సింగరేణి మందమర్రి ఏరియా డీజీఎం (ఎలక్ట్రిసిటీ విభాగం) కృష్ణారెడ్డిని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.
కరెంట్ కనెక్షన్‌ల తొలగింపుతో వీధిలో ఆందోళన చెందుతున్న బస్తీ వాసులు
బెల్లంపల్లి: సింగరేణి యాజమాన్యం ఒక్కో బాధ్యత నుంచి వైదొలుగుతోంది. ఇప్పటికే క్వార్టర్లను వది లించుకున్న సంస్థ.. ఇప్పుడు ఆ క్వార్టర్లకు సరఫరా చేసే విద్యుత్‌ను కట్ చేస్తోంది. ఎలక్ట్రిసిటీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బెల్లంపల్లి పట్టణంలోని క్వార్టర్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఉదయమే కన్నాల బస్తీ, టేకుల బస్తీకి సిబ్బందితో చేరుకున్న అధికారులు వరుసగా వి ద్యుత్ కనెక్షన్ల తొలగింపు చేపట్టారు. క్వార్టర్‌కు కరెంట్ సరఫరా చేసే వైరుతోపాటు స్తంభానికి అమర్చిన కరెంట్ బాక్స్‌లను సైతం తొలగించారు. దీంతో ఆయా బస్తీల్లో నివాసం ఉంటున్న రిటైర్డు కార్మికులు, నిరుపేదలు, కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కొన్నేళ్లుగా సింగరేణి హెచ్చరిస్తోంది. ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని సూచించింది. దీంతో చాలా మంది ఇప్పటికే ప్రభుత్వ కనెక్షన్లు తీసుకున్నారు. ఇక ఇప్పటికే కొన్ని కనెక్షన్లు అడపాదడపా తొలగించింది. ఈసారి వరుసగా కనెక్షన్లన్నీ తొలగించడం మొదలు పెట్టింది.
గనులు మూత పడటంతో...
బెల్లంపల్లిలో బొగ్గు గనులు మూతపడటంతో సింగరేణి యాజమాన్యం కరెంట్ సరఫరా నుంచి వైదొలగాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. బెల్లంపల్లి కేంద్రంగా దాదాపు రెండు దశాబ్దాల క్రితం భూ గర్భ గనులు మూతపడుతూ వచ్చాయి. పవర్ హౌస్‌ను ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థకు విక్రయించింది. సింగరేణి విభాగాలు ఇతర ప్రాంతాల కు తరలించారు. చివరికి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయాన్నీ ఎత్తేసింది. బెల్లంపల్లి ఏరియా పే రుతో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో ఏర్పాటు చేశారు. గనుల మూత, విభాగాల తరలింపు, జీఎం కార్యాలయం ఎత్తివేతతో బెల్లంపల్లిలో దాదాపు సింగరేణి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. కేవలం సింగరేణి ఏరియా ఆస్పత్రి, బిల్డింగ్ డిపార్ట్‌మెంట్, ఎక్స్‌ఫ్లోరేషన్, ఎలక్ట్రిసిటీ, ఎస్‌అండ్‌పీసీ విభాగాలు నామమాత్రపు సిబ్బందితో అతికష్టంగా కొనసాగిస్తున్నారు.
లీజు భూమిని అప్పగించి..
బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లిలో బుధాకలాన్ గ్రామ శివారు సర్వే నంబర్ 170లో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని 99 ఏళ్ల కాలపరిమితితో లీజుకు తీసుకుంది. కొన్నాళ్ల క్రితమే ఆ లీజు గడువు కూడా తీరిపోగా భవిష్యత్ అవసరాల కోసమని లీజు గడువును రెన్యూవల్ చేయిస్తూ వస్తోంది. ఓ పక్క గనులు మూత పడడం, మరోవైపు లీజు గడువు ముగియడంతో భూములు, కంపెనీ క్వార్టర్లు ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించింది. దీంతో చాలా మంది ఇంటి నంబర్లు తీసుకుని నల్లా కనెక్షన్ పొందారు. ఎన్‌పీడీసీఎల్, సింగరేణి కరెంటు కనెక్షన్లు తీసుకున్నారు. దీంతో కంపెనీ క్వార్టర్లకు ఉన్న సింగరేణి విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని యాజమాన్యం నిర్ణయించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. అయితే బస్తీల్లో ఎన్‌పీడీసీఎల్ విద్యుత్‌లైన్ల విస్తరణ పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో ప్రభుత్వ కనెక్షన్ లేనివారు సింగరేణి చర్యతో ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment