ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
● టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం
ఆదిలాబాద్‌టౌన్: పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్, టీఎస్టీఎల్‌ఐ సరెండర్, పెన్షనరీ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రత్యేక చొరవ తీసుకొని జీవో 317 ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు తీసుకురావాలన్నారు. బదిలీల్లో సాంకేతిక కారణాలతో నష్టపోయిన ఉపాధ్యాయుల అప్పీల్‌ను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. సర్వీస్‌రూల్స్ సమస్యను పరిష్కరించి ఎంఈవో, డైట్ లెక్చరర్, డిప్యూటీ ఈఓ పోస్టులకు పదోన్నతులు కల్పించాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజన బాధ్యతల నుంచి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను తప్పించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రఘునందన్‌రెడ్డి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వం పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.మురళీమనోహర్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పి.మొగులయ్య, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డి.మల్లారెడ్డి, మాజీ సహా అధ్యక్షుడు ఎన్.రాజేశ్వరరావు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ఎం.జలంధర్‌రెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు టి.రవికాంత్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి పి.సదాశివ్, రాష్ట్ర నాయకులు రంగినేని రామారావు, ఎ.లక్ష్మీప్రసాద్ రెడ్డి, బలిరాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment