అట్టహాసంగా రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం సమీపంలోని చొప్పరిపల్లి సమీపంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఆదివారం 5వ రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. డ్రంకెన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కుంగ్‌ఫూ, యూనైటెడ్ డిస్ట్రిక్ట్ ఆల్‌స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. నిర్వాహకులు స్థానిక నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రోత్సహించేందుకు పోటీలు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు, యువకులు చదువుతోపాటు అన్నిరంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. కరాటే, కుంగ్‌ఫూ స్వీయ రక్షణకు ఉపయోగపడతాయని తెలిపారు. వివిధ విభాగాల్లో వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. కార్యక్రమంలో టోర్నమెంట్ చైర్మన్ దాగం మల్లేశ్, ముఖ్య అతిథులుగా నాయకులు నాతరి స్వామి, రత్నం ప్రదీప్, ముత్తె భూమయ్య, సూరం సంపత్, దుర్గం గోపాల్, నిర్వాహకులు కుందేల్ల రవి, క్రీడాకారులు, మాస్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment