జిల్లా వాసులకు పూలే అవార్డు
మంచిర్యాలక్రైం: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం, బీసీ సంక్షేమ సంఘం మహిళా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్లో మంచిర్యాలకు చెందిన మహిళా న్యాయవాది పేరం ఆలేఖ్య, శ్రీరాంపూర్‌కు చెందిన ఆడెపు శ్యామల సావిత్రిబాయి పూలే అవార్డు అందుకున్నారు. అలేఖ్య సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ మహిళలను చైతన్య పరిచేందుకు అనేక సేవ కార్యక్రమాలు చేపట్టారని, శ్యామల సామాజిక, రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించిందని బీసీ సంఘం నాయకులు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమడుగు ఫ్‌లైఓవర్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా ర్యాలీఘడ్‌పూర్‌కు చెందిన అయిత రాజు, కళ్యాణ్, ప్రభాస్ ద్విచక్రవాహనంపై భీమిని మండలంలోని భీంపూర్ వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా పులిమడుగు సమీపంలోని ఫ్‌లైవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజు (24) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment