షార్ట్‌సర్క్యూట్‌తో రెండు దుకాణాలు దగ్ధం
బాసర: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మండల కేంద్రంలోని రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. స్థానిక బస్టాండ్ సమీపంలో గల శారదా ప్రియ మిల్క్ బేకరీ, గ్రామంలోని పోచమ్మగల్లిలో మరో కిరాణంలో శుక్రవా రం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. ఘటనలో సుమారు రూ.10 లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించినట్లు బాధితులు వాపోయారు. సంఘటన స్థలాన్ని ఎస్సై గణేశ్, ఆర్‌ఐ సందర్శించి వివరాలు సేకరించారు.
చెప్పుల షాపులో..
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని భుక్తాపూర్ కాలనీ బి.రాములు కాంప్లెక్స్ సమీపంలో గల గోల్డ్‌లుక్ ఫుట్‌వేర్ షాపులో గురువారం రాత్రి చోరీ జరిగినట్లు వన్‌టౌన్ ఎస్సై అశోక్ తెలిపారు. రోజు మాదిరిగానే రాత్రి 9 గంటల ప్రాంతంలో షాపు మూసివేసిన యజ మాని షహాజాద్‌ఖాన్ శుక్రవారం ఉదయం వచ్చి చూసే సరికి షెట్టర్ పైకి ఎత్తి ఉన్నట్లు తెలిపారు. కౌంటర్‌లో ఉన్న రూ.2వేల నగదును ఎత్తుకెళ్లారని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఎలక్ట్రికల్ సామగ్రి దగ్ధం
నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్ షాపులో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధమైంది. షాపు యజమాని రాజారపు జనార్ధన్ షాపు మూసి పని నిమిత్తం బయటికి వెళ్ళాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మీటర్‌లో షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఘటనలో సుమారు రూ.50వేల సామగ్రి దగ్ధమైనట్లు బాధితుడు తెలిపాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై సాయికిరణ్, లైన్‌మెన్ మహిపా ల్ పరిశీలించి పంచనామా చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని షాపు యజమాని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment