మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మహోన్నతుడు
బెల్లంపల్లి: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మహోన్నతుడని, దేశాన్ని కష్టకాలంలో గట్టెక్కించిన దూరదృష్టి కలిగిన ఆర్థికవేత్తని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కొనియాడా రు. గురువారం పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మన్మోహన్‌సింగ్ సంతాపసభ నిర్వహించా రు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన క్రమంలో దేశాన్ని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. జైపూర్ పవర్ ప్లాంటును మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ జె.శ్వేత, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, పీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచంద ర్, డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు నాతరి స్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment