రైతు ఉత్పత్తులు సైతం..
వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేస్తూ అనేక మంది తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉదాహరణకు హాజీపూర్ ఫార్మర్ కంపెనీ ఆర్గనైజేషన్‌తో రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్ముకుంటున్నారు. అలాగే పరస్పర సహకారంతో వాట్సాప్ వేదికగా ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకుని సమాచారం పంచుకుంటున్నారు. ఇటీవల వానాకాల సీజన్‌లో రైతులే ధాన్యం సేకరించి, బియ్యంగా మార్చి విక్రయాలు చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్‌లతో సమాచారం అందిస్తూ అవసరమైన వారికి చేరుస్తున్నారు. వీరే కాకుండా అనేక ప్రాంతాల రైతులు తమ ఉత్పత్తులను అమ్మేస్తున్నారు. ఇక జిల్లా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం వాట్సాప్ గ్రూప్ సైతం పంటల సాగుకు ప్రోత్సాహం, ఉత్పత్తుల విక్రయాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment