వందకోట్లతో అభివృద్ధి పనులు
● చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గంలో రూ.వందకోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎ మ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రూ. 50 లక్షల నిధులతో చేపట్టిన గిరిజన ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి శనివారం భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 34 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 50 మందికి సీ ఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చల్లా రాంరెడ్డి, హిమవంతరెడ్డి, సూర్యనారాయణ, బాపాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
భీమారం: మండల కేంద్రంలో సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టనున్న సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో వైకుంఠరథం ఏర్పాటు చేయాలని పలువురు యువకులు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment