రేపు ఉమ్మడి జిల్లాస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం
నిర్మల్‌చైన్‌గేట్: ఈ నెల 6న ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఆదిలాబాద్‌లోని ప ద్మనాయక్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసినట్లు డీ సీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తెలిపారు. శనివారం ఆ యన జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో గత పార్లమెంట్ ఎ న్నికలపై విశ్లేషణ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చ ఉంటుందని పేర్కొన్నారు. సమావేశానికి కా ర్యకర్తలంతా అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. నిర్మల్, సారంగపూర్ మార్కె ట్ కమిటీల చైర్మన్లు భీంరెడ్డి, అబ్దుల్ హాది, పార్టీ నా యకులు నాందేడపు చిన్ను, ఒడ్నాల రాజేశ్వర్, శ్రీని వాస్‌రెడ్డి, గాజుల రవి, వేణుగోపాల్, హర్ష త్, సభా ఖలీం, వెంకట్‌రామ్ రెడ్డి, మజర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment