టైగర్‌జోన్‌లో రాకపోకలపై కఠిన నిర్ణయం
జన్నారం: టైగర్‌జోన్‌లో రాత్రిపూట రాకపోకలపై కఠినంగా వ్యవహరించనున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. టైగర్‌జో న్ ప్రాంతంలో రాత్రి 9 గంటల నుంచి ఉద యం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధించామని, అయితే కొందరు ఇదే దారి గుండా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల ప్రాంతాల వైపు రాకపోకలు కొనసాగిస్తున్నారన్నారు. రాత్రి పూట వన్యప్రాణులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రా త్రి 9 గంటలు దాటాక స్థానికులు తప్పా ఇతర ప్రాంతాల వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. వన్యప్రాణుల సంక్షేమం, ప్ర యాణికుల సురక్షిత ప్రయాణం విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ విషయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment