సహకార సంఘాలు రైతులకు సేవలందించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: సహకార సంఘాలు రైతుల పరపతిని పెంచి ఆర్థికంగా పరిపుష్టం కావాలని, రైతులకు విశిష్టమైన సేవలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతి లాల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్విభజన అంశంపై జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు శంకర్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఎంజీఎం రామకృష్ణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతిలతో కలిసి సహకార సంఘాల ప్రతినిధులు, మండ ల వ్యవసాయ అధికారులు, బ్యాంకు మేనేజ ర్లు, సూపర్‌వైజర్లతో సమీక్ష నిర్వహించారు. జి ల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సహకార సంఘాల ఆర్థిక పరిపుష్టత, వ్యాపార లావాదేవీ లు, సంఘ సిబ్బంది వివరాలు, భౌగోళిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఉపయోగపడే విధంగా పునర్విభజన జరగాలని తెలిపా రు. నూతన మండలాల ప్రాతిపదికన సంఘాల పునర్విభజన చేయాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment