విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
భీమిని/బెల్లంపల్లి: వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితా లు సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. గురువారం కన్నెపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ, బెల్లంపల్లిలోని కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. వంటగది, ఆర్‌ఓ ప్లాంట్, నూతన మె నూ పట్టిక, పరిసరాలు పరిశీలించారు. పదవ తరగ తి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి పఠనా సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు గణిత పా ఠ్యాంశాలను బోధించారు. ఉపాధ్యాయులు సిలబ స్ పూర్తి చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నా రు. నూతన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. కన్నెపల్లిలో కోడిగుడ్ల సరా ఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్‌తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. రోడ్డు భద్రతా నియమ, నిబంధనలు వివరిస్తూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment