బీసీ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి
పాతమంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని జాతీయ బీసీ హ క్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశా రు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని తెలిపారు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు శాఖపురి భీంసేన్, కీర్తి భిక్షపతి, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్, బండ సతీష్, ఆరెందుల రాజేశం, షేక్ సల్మాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment