‘కమ్యూనిస్టు సైద్ధాంతిక తత్వవేత్త ఏబీ బర్ధన్’
పాతమంచిర్యాల: కమ్యూనిస్టు సైద్ధాంతిక తత్వవేత్త ఏబీ బర్ధన్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో కమ్యూనిస్టు నాయకు డు ఏబీ బర్ధన్ 9వ వర్ధంతిని ఘనంగా నిర్వహించా రు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ బర్ధన్ తన చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు సిద్ధాంతాలను అనుసరించి ప్రజలు, కార్యకర్తలతో మమేకం అయ్యారని, నిరాడంబరమైన జీవితాన్ని గడపారని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఖలిందర్ అలీఖాన్, జోగుల మల్లయ్య కారుకూరీ నగేష్, మిట్టపల్లి శ్రీనివాస్, మొగిలి లక్ష్మణ్, కోడి వెంకటేశ్వర్‌రావు, పూజారీ రామన్న, మండ యాదగిరి, నర్సయ్య, సారయ్య, రాయమల్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment