70.02 శాతం సమగ్ర సర్వే పూర్తి
తూప్రాన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే డివిజన్ పరిధిలో 70.02 శాతం పూర్తి అయిందని ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో కొనసాగుతున్న సర్వేను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 374 ఎన్యూమరేటర్లతో సర్వే జరుగుతోందన్నారు. చేగుంట మండలం 74.38 శాతం, తూప్రాన్ మున్సిపాలిటీ 71.80, మనోహరాబాద్ మండలం 71.40, తూప్రాన్ మండ లం 72.57, మాసాయిపేట్ మండలం 65.87, వెల్దుర్తి మండలం 57.90, కాగా సర్వేలో నార్సింగి మండలం 78.32 శాతం పూర్తి చేసుకుని డివిజన్‌లో మొదటి స్థానంలో ఉందన్నారు. నార్సింగి తహసీల్దార్, ఎంపీడీఓలను అభినందించారు.
రెండో రోజుకు
వాలీబాల్ పోటీలు
చేగుంట (తూప్రాన్): ఎస్‌జీఎఫ్ అండర్ 14 రాష్ట్రస్థాయి వాలీబాల్ బాలబాలికల పోటీలు రెండోరోజైన ఆదివారం కూడా కొనసాగాయి. మండల కేంద్రమైన చేగుంట ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తున్న పోటీలకు జిల్లాల నుంచి క్రీడాకారులు తరలి వచ్చారు. సోమవారం క్రీడలు ముగియనున్నట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి అల్లి నరేశ్ పేర్కొన్నారు. పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, పీడీ శారద, పీఈటీ మంజుల, వాలీబాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పరంజ్యోతి, కర్ణం గణేశ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మర్యాదపూర్వక కలయిక
మెదక్ కలెక్టరేట్: హైదరాబాద్‌లోని ఎంపీ రఘునందన్‌రావును ఆయన స్వగృహంలో మెదక్ విద్యుత్ శాఖ డీఈ చాంద్ షరీఫ్ బాషా ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెదక్ విద్యుత్ శాఖ డీఈగా బాధ్యతలను ఆయన స్వీకరించారు.
హెల్ప్ డెస్క్‌తో
దరఖాస్తుల స్వీకరణ
మెదక్ కలెక్టరేట్: నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే ప్రజలు దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గ్రూప్–3 పరీక్షలు, సమగ్ర కుటుంబ సర్వేల్లో సంబంధిత శాఖల అధికారులు విధుల్లో నిమగ్నమై ఉన్నారని, అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండరని తెలిపారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
తూప్రాన్: మెదక్ జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికై ంది. అధ్యక్షుడిగా రాజశేఖర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శిగా చూర్ణం విద్యాసాగర్‌లను ఎన్నుకున్నారు. కోశాధికారిగా రాజు, ఉపాధ్యక్షుడిగా శంకర్, సంయుక్త కార్యదర్శులుగా కిషన్, అశోక్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అస్లాంఖాన్, పోచయ్య, ఎగ్జిక్యూటివ్ గౌరవాధ్యక్షుడిగా షట్యయ్య, మెంబర్లుగా బాలకిషన్, యాదగిరి, అనిల్‌కుమార్, సత్యనారాయణ, రమేష్, కిషన్, రాజులు ఎన్నికయ్యారు. ఆదివారం మెదక్ కేంద్రంలో రాష్ట్ర రిటైర్డ్ పోలీస్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికై న నూతన సభ్యులు రిటైర్డ్ పోలీస్‌ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
తూప్రాన్‌లో ఇంటింటి సర్వేను పర్యవేక్షిస్తున్న ఆర్డీఓ జయచంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment