చిన్నారులకు ప్రాథమిక విద్య పునాది
ఆర్డీఓ జయచంద్రారెడ్డి
తూప్రాన్: ప్రాథమిక విద్యతోనే చిన్నారులకు పునా ది బాటలు పడుతాయని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ము న్సిపల్ కార్యాలయంలో మండలస్థాయి బాల మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యతో పాటు ఆటపాటలు అందుతాయన్నారు. చిన్నారుల పట్ల టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ గణేష్‌రెడ్డి, మున్సి పల్ చైర్‌పర్సన్ జ్యోతికృష్ణ, సీడీపీఓ హేమభార్గవి, ఎంఈఓ సత్యనారాయణ, కౌన్సిలర్ శ్రీశైలం, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు శివకుమారి, సునీత, పిల్లల తల్లిదండ్రులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment