![ఏసయ్య](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09mdk11-350122_mr-1739152419-0.jpg.webp?itok=f9vQeM9o)
ఏసయ్య.. కరుణించు
మెదక్‌జోన్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రెండు పర్యాయాలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం ప్రెసిబెటరీ ఇన్‌చార్జి శాంతయ్య, మధ్యాహ్నం రిటైర్డ్ ప్రెసిబెటరీ ఇన్‌చార్జి జయరాజ్ భక్తులనుద్దేశించి దైవ సందేశం ఇచ్చారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఉపాధ్యాయుల
సమస్యలపై ప్రత్యేక దృష్టి
మెదక్ కలెక్టరేట్: ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలు పెంచడంలో పీఆర్టీయూటీఎస్ ఎంతో కృషి చేసిందని సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకరి కృష్ణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూటీఎస్ భవన్ వద్ద ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం వ్యవస్థాపకుడు సామల యాదగిరి చిత్రపటానికి నివాళులర్పించి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూటీఎస్ చేసిన సేవలను వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఘం అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీనియర్ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్యా నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలపై పోరాటం
నారాయణఖేడ్: కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఏసురత్నం ఆదివారం సంఘం నాయకులకు సూచించారు. కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని సంఘం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోరాటం చేస్తోందని వివరించారు.
![ఏసయ్య.. కరుణించు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09mdk03-350071_mr-1739152419-1.jpg)
ఏసయ్య.. కరుణించు
Comments
Please login to add a commentAdd a comment