![విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09nrs05-350088_mr-1739152420-0.jpg.webp?itok=FrB1PmsM)
విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్
నర్సాపూర్: విద్య, వైద్యానికి సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎం కప్ క్రికెట్ పోటీల ముగింపు కా ర్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. క్రీడల్లో ఓడినా వారు నిరుత్సాహ పడవద్దన్నారు. టోర్నమెంట్‌లో సంగారెడ్డికి చెందిన ఎంఎస్ అకాడమి జట్టు ప్రథమ స్థానంలో నిలువగా.. నర్సాపూర్‌కు చెందిన సర్కిల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. వీరికి బహుమతులు అందజేశారు. అనంతరం ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాల, కాలేజీ అడ్మిషన్లకు సంబంధించిన బ్రోచర్‌ను ప్రిన్సిపాల్ నసీమా షేక్‌తో కలిసి ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment