![ఢిల్లీ ప్రజలు ధర్మానికి పట్టం కట్టారు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09mdk02-350071_mr-1739152419-0.jpg.webp?itok=qdtIwE2P)
ఢిల్లీ ప్రజలు ధర్మానికి పట్టం కట్టారు
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
మెదక్‌జోన్: మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ ప్రజలు ధర్మానికి పట్టం కట్టారని మెదక్ ఎంపీ రఘునందర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన మెదక్‌లో విలేకరులతో మాట్లాడారు.. అక్రమ లిక్కర్ వ్యాపారంలో ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్ చేసిన అవినీతి అంతా ఇంతా కాదన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓటమికి సైతం అవినీతే కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలుకుని అన్నింట్లో అవినీతికి పాల్పడి రూ. లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. ఇక ఢిల్లీలో కాంగ్రెస్‌కు మి గిలింది గాడిద గుడ్డేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 వేల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదని మండిపడ్డారు. అర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం లాంటి ఎన్నో గొప్ప పనులు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని గెలిపించుకోవాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువత బీజేపీ వైపే ఉందని.. ప్రతి గ్రాడ్యుయేట్‌ను కలిసి ఓటు అడగాల్సి బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, నాయకులు శ్రీనివాస్, ప్రసాద్, ఎంఎల్‌ఎన్ రెడ్డి, విజయ్‌కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment