మరోసారి మంచి మనసు చాటుకున్న సూర్య | Actor Surya Once Again Shows His Big Heart | Sakshi
Sakshi News home page

మరోసారి మంచి మనసు చాటుకున్న సూర్య

Published Tue, Sep 1 2020 6:43 AM | Last Updated on Tue, Sep 1 2020 6:43 AM

Actor Surya Once Again Shows His Big Heart - Sakshi

చెన్నై : హీరో సూర్య మరోసారి మంచి మనసు చాటుకున్నారు. కళాకారులు, డిస్ట్రిబ్యూటర్లు, మీడియా, పీఆర్‌ఓలు, థియేటర్ల సిబ్బంది, కరోనా వ్యాధి బారిన పడ్డ వారిని కాపాడడానికి అహర్నిశలు శ్రమించిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య శాఖ కార్మికులు, తన అభిమాన సంఘాలకు చెందిన వారికి ఆర్థిక సాయం అందించనున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో సూర్య పేర్కొన్నారు. ఆయన తాజాగా నటించి, నిర్మించిన చిత్రం సూరరై పోట్రు ప్రసార హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫాం అమేజాన్‌ ప్రైమ్‌ విక్రయించారు. ఇది అక్టోబర్‌ 30వ తేదీన విడుదల కానుంది. కాగా సూరరై పోట్రు చిత్రాన్ని విక్రయించిన మొత్తంలో రూ.5 కోట్ల వరకు అవసరమైన వారికి సాయం చేస్తానని సూర్య ప్రకటించిన విషయం తెలిసిందే. ( సూర్య సినిమా 200 దేశాల్లో విడుద‌ల‌ )

అందులో భాగంగా ఇప్పటికే దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య, దర్శకుల సంఘం, నటీనటుల సంఘాలకు రూ.కోటిన్నర విరాళంగా అందించారు. తాజాగా పైన చెప్పిన సంఘాల్లో సభ్యులు కాని వీరి కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువు కోసం తలా పదివేలు అందించనున్నట్లు తెలిపారు. వీరంతా అగరం ఫౌండేషన్‌ చెందిన దరఖాస్తుల్లో వారి వివరాలను నమోదు చేసి పంపించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement