మాలీవుడ్‌ స్టార్‌ హీరోలలో అల్లు అర్జున్‌ ఎవరో తెలుసా? | Allu Arjun Video Which Mallu Actor Are You Goes Viral on Social Media | Sakshi
Sakshi News home page

Allu Arjun: ‘మల్లు’ అర్జున్‌ ఫన్నీ వీడియో వైరల్‌..

Published Tue, Sep 7 2021 1:43 PM | Last Updated on Tue, Sep 7 2021 2:50 PM

Allu Arjun Video Which Mallu Actor Are You Goes Viral on Social Media - Sakshi

అల్లు అర్జున్‌.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. కుంచాకో బోబన్..ఈ పేరు తెలియని మలయాళ ప్రేక్షకులు ఉండరు. ఇప్పుడు వీరిద్దరి పేర్లు ​సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దానికి కారణం అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ ఫన్నీ వీడియో.

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. స్టైల్‌తో పాటు డాన్సులతో అదరగొట్టే ఈ ఐకాన్‌ స్టార్‌ తన సినిమా విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటాడు. అయితే ఆయనకు తెలుగులో ఎంత క్రేజ్‌ ఉందో, మలయాళంలోనూ అంతే పాపులారిటీ ఉంది.మల్లు స్టార్‌ హీరోలతో సమానంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఆయన రెండో సినిమా ఆర్య నుంచి ప్రతి సినిమా అక్కడ విడుదల అయ్యేలా చూసుకుంటాడు. అందుకే అక్కడి అభిమానులు బన్నీని ముద్దుగా ‘మల్లు’ అర్జున్‌ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. 
(చదవండి: బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం)

కాగా, అల్లు అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫిల్టర్లను ఉపయోగించి మాలీవుడ్‌ నటులతో పోల్చుకున్నాడు. దీంతో  ‘మీరు ఏ మల్లు యాక్టర్ ?’ అని ఇన్‌స్టా ఫిల్టర్‏లో బన్నీ చెక్‌ చేసుకోగా, మాలీవుడ్‌ విలక్షణ నటుడు కుంచాకో ఫోటో చూపించింది. . ఈ వీడియోని తన అఫిషీయల్‌ అకౌంట్‌లో షేర్‌ చేసుకోవడంతో వైరల్‌గా మారింది. 

కాగా, మాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరున్న కుంచాకో బోబన్ అక్కడ 90కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు.  విభిన్నమైన కథాంశాలను ఎంచుకొంటూ మల్లు పరిశ్రమలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. నిఫా వైరస్‌, నీడ వంటి డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సైతం ఓటీటీ ద్వారా పలకరించి అలరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement