బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఏడో సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఆరు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ అతిపెద్ద రియాల్టీ షో ఏడో సీజన్ సాయంత్రం 7 గంటలకు ఘనంగా ప్రారంభం కాబోతుంది. ఈ సారి కూడా కింగ్ నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. గత సీజన్లకు పూర్తి భిన్నంగా ఏడో సీజన్ ఉంటుందని మొదటి నుంచి మేకర్స్ చెబుతూ వస్తున్నారు.
ఆరో సీజన్‌పై విమర్శలు రావడంతో తాజా సీజన్‌లో పలు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపికలో బిగ్ నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటను కూడా సరికొత్తగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఉల్టా పుల్టా అంటూ నాగార్జున చెప్పే మాటలను బట్టి ఎవరూ ఊహించని విధంగా ఈ ఆట సాగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కంటెస్టెంట్ల లిస్ ఇది అంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలు చూస్తే కొంతమందిని ఈజీగా గుర్తించవచ్చు.
(చదవండి: నటి ఇంట విషాదం.. చివరి నిమిషంలో బిగ్‌బాస్‌కు గుడ్‌బై!)
నిన్న సాయంత్రం విడుదలైన ప్రోమోలో ఎరుపు చీరతో దర్శనమిచ్చిన బ్యూటీ శోభా శెట్టి అని ఈజీగా గుర్తించవచ్చు. కార్తీక దీపం సీరియల్ మోనిత పాత్రలో నటించిన శోభా.. అదే పేరుతో ఫేమస్ అయింది. ఇక అదే ప్రోమోలో కండలు తిరిగిన దేహంతో ఓ యువకుడు కనిపిస్తున్నాడు. అతను మోడల్ ప్రిన్స్ యావర్. నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్‌లో నటించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తుంటాడు. బ్లాక్ డ్రెస్‌లో కనిపించిన ఆమె ప్రియాంక జైన్‌లా ఉంది.
వీరితో పాటు సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి, అర్జున్ అంబటి, కొరియోగ్రాఫర్ ఆట సందీప్, హీరో శివాజీ, నటుడు ‘ఈటీవీ’ప్రభాకర్, హీరోయిన్ ఫర్జానా, సీరియల్ నటి ప్రియాంక జైన్, సింగర్ దామిని భట్ల, అథ్లెటిక్ క్రిడాకారిణి ఐశ్వర్య పిస్సే, యాంకర్ ప్రత్యూష, పల్లవి ప్రశాంత్, యాంకర్ నిఖిల్, యాంకర్ క్రాంతి, టేస్టీ తేజా, హీరో గౌతమ్ కృష్ణ బిగ్‌బాస్-7లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎంతమంది హౌస్‌లోకి అడుగుపెడతారు అనేది ఈ రోజు సాయంత్రం తెలిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment