
లైఫ్‌లో ఒక్కసారైనా బిగ్‌బాస్‌కు వెళ్లాలని చాలామంది అనుకుంటారు. అదే సమయంలో బిగ్‌బాస్‌కు చచ్చినా వెళ్లమని కొందరు సెలబ్రిటీలు ముక్తకంఠంతో చెప్తుంటారు. కారణం.. బిగ్‌బాస్ ఓ మాయాజాలం. ఒక్కసారి ఇక్కడ అడుగుపెట్టాక ఎలాంటి పేరుతో బయటకు వస్తామన్నది ఎవ్వరూ చెప్పలేరు. కొందరు పేరు ప్రతిష్టలతో బయటకు రావచ్చు, మరికొందరు అప్రతిష్టను మూటగట్టుకుని రావచ్చు.
అందుకే కొందరు తారలు ఈ షోకు వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తారు. అయితే అలా వెనకడుగు వేసేవారి కంటే వెళ్లాలని తాపత్రయపడేవాళ్లే ఎక్కువమంది! చలాకీ చంటి కూడా బిగ్‌బాస్‌కు వెళ్లాలనుకున్నాడు. కానీ మొదట్లో పెద్దగా లక్ష్యపెట్టలేదు. మూడుసార్లు ఈ రియాలిటీ షో నుంచి పిలుపు వచ్చినా లెక్కచేయలేదు. అయితే నాలుగోసారి మాత్రం ఆఫర్ రాగానే నో చెప్పేందుకు నోరు రాలేదన్నాడు చంటి.
ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నేను జబర్దస్త్ టీమ్‌లో మొదటి నుంచి కొనసాగుతున్నాను. నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిందని మల్లెమాల టీమ్‌కు చెప్పగానే వాళ్లు నో చెప్పారు. సంస్థలో సీనియర్‌గా కొనసాగుతున్న నేను ఇప్పుడు సడన్‌గా తప్పుకోవడం ఎందుకని వాళ్లు నన్ను ఆపేందుకు ప్రయత్నించారు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు వెళ్లడం? తొందరెందుకు, తర్వాత చూడండి అని అడిగారు. కానీ నాకు డబ్బులు కావాలి, కొన్ని బాధ్యతలున్నాయి.. వెళ్తానని చెప్పాను. కావాలంటే మనం వేరే షోలు ప్లాన్ చేద్దాం అన్నారు. నేను ఒప్పుకోలేదు. కావాలంటే బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చాక ప్లాన్ చేద్దాం అని చెప్పాను. అంతేకాదు, బిగ్‌బాస్ అయిపోగానే జబర్దస్త్‌కు తిరిగి వచ్చేస్తానని చెప్పాను. ఈ మాట ఇంతకుముందెవరూ చెప్పలేదు. నేను తిరిగొస్తానని చెప్పడంతో వాళ్లు ఓకే అన్నారు' అని చెప్పుకొచ్చాడు చలాకీ చంటి.
చదవండి: ఫస్ట్ వీక్ నామినేషన్‌లో ఉన్నది ఎవరెవరంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో మొగుడుపెళ్లాల కొట్లాట
Comments
Please login to add a commentAdd a comment