Deepika Padukone Deleted All Posts In Her Instagram And Twitter - Sakshi
Sakshi News home page

ఖాతా ఖాళీ చేసిన స్టార్‌ హీరోయిన్‌

Published Fri, Jan 1 2021 10:53 AM | Last Updated on Fri, Jan 1 2021 11:30 AM

Deepika Padukone Deletes All Posts In Social Media On New Year - Sakshi

కొత్త సంవత్సరం అంటేనే కేక్‌ కటింగులు, గ్రీటింగ్‌లు, సెలబ్రేషన్‌లు.. అబ్బో.. ఇలా చాలానే ఉంటాయి. సెలబ్రిటీలు అయితే ఈ రోజు అభిమానులకు స్పెషల్‌ విషెస్‌ తెలుపుతూ సోషల్‌ మీడియాలో హడావుడి చేస్తుంటారు. వీలైతే తమ కొత్త సినిమా అప్‌డేట్‌ చెప్పి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు. కానీ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకోన్‌ మాత్రం ఇందుకు భిన్నంగా సోషల్‌ మీడియాలో తన పోస్టులు డిలీట్‌ చేసి అభిమానులకు షాకిచ్చింది. కొత్త ఏడాదికి శుభం పలుకుతూ ఏదైనా స్పెషల్‌ మెసేజ్‌ ఇస్తుందేమో అనుకుంటే ఇలా తన ఖాతాలను ఖాళీ చేయడమేంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 52 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో దీపిక అన్ని పోస్టులు తొలగించడంతో ప్రస్తుతం ఆమె పోస్టుల సంఖ్య జీరోగా ఉంది. (చదవండి: వణక్కమ్‌ దీపికా)

27 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ట్విటర్‌ ఖాతాలోనూ ఇప్పటివరకు చేసిన ట్వీట్లన్నింటిని తొలగించింది. అయితే ఇదంతా ఎందుకు చేసిందో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. 'కొంపదీసి ఆమె అకౌంట్‌ హ్యాక్‌ అయిందా?', 'ఆమెకు అంతా బాగానే ఉంది కదా!', 'ఈ చర్య వెనుక ఏదైనా మర్మముందా?' అంటూ రకరకాల అనుమానాలను లేవనెత్తుతున్నారు. వీటన్నింటిపై దీపికా పదుకొనె స్పందించాల్సి ఉంది. ఇక దీపిక సినిమాల విషయానికొస్తే.. రణ్‌వీర్‌ సింగ్‌ '83', షారుఖ్‌ ఖాన్‌ 'పఠాన్'‌లో నటిస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించనున్న ప్యాన్‌ ఇండియా చిత్రంలోనూ కనిపించనున్నారు. అలాగే షాకున్‌ బాత్రా డైరెక్షన్‌లో కూడా నటిస్తున్నారు. (చదవండి: నెగటివ్‌ రోల్‌ కోసం.. రూ. 20 కోట్లు‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement