యశ్‌కు భార్య రాధికా బర్త్‌డే విషెస్‌ | Happy Birthday Bestie: Radhika Pandit | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే బెస్టీ: రాధికా పండిట్‌

Published Fri, Jan 8 2021 2:45 PM | Last Updated on Fri, Jan 8 2021 2:46 PM

Happy Birthday Bestie: Radhika Pandit - Sakshi

కన్నడ స్టార్‌ ​హీరో యశ్‌ నేడు(శుక్రవారం) 35వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి రాధికా పండిట్‌ సోషల్‌ మీడియా వేదికగా భర్తకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే మై బెస్టీ అంటూ కేకు తినిపించుకుంటున్న ఫొటోలను షేర్‌ చేశారు. పలువురు సెలబబ్రిటీలు సైతం ఈ రాకింగ్‌ స్టార్‌కు విషెస్‌ తెలుపుతున్నారు. ఇక రాఖీ భాయ్‌ బర్త్‌డే సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న కేజీఎఫ్‌ 2 సినిమా టీజర్‌ ఒకరోజు ముందే విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌ మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతూ సోషల్‌ మీడియాను శాసిస్తోంది. 

కాగా యశ్‌కు తొలుత సీరియల్స్‌లో ఛాన్స్‌ రాగా తరువాత సినిమాల్లో సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ చేశారు. 2008లో రాధిక పండిట్‌ సరసన 'మొగ్గిన మనసు' చిత్రంతో సినిమాల్లో అడుగు పెట్టారు. ఇది సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో పాటు యశ్‌కు ఫిలింఫేర్‌ అవార్డును తెచ్చిపెట్టింది. తర్వాత 2016లో తన తొలి సినిమా హీరోయిన్‌ రాధికానే పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐరా అనే కూతురు, అధర్వ్‌ అనే కొడుకు ఉన్నారు. (చదవండి: యశ్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement