ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఏఆర్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీజ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సామ్, వంశీ కృష్ణ వర్మ నిర్మిస్తున్న సినిమా ‘నిదురించు జహాపన’( Nidurinchu Jahapana Movie). నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 14న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎంత గొప్ప కథ ఉందో చేయడానికి కూడా అంత గొప్ప కథ ఉంది. ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాం. ఇది చాలా ఇంట్రస్టింగ్ జర్నీ. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని కొత్త కథ చెప్పాలనే లక్ష్యంతో చేసిన సినిమా. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మీరు చూస్తారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను.
నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పెరిగాను. రెండు వందలమంది కలసి సినిమా చూడటం ఒక ఎమోషన్ నాకు. సినిమా అనేది అలాంటి ఎక్స్ పీరియన్స్. చిన్న సినిమాలకు ఆడియన్స్ రావడం తగ్గించారు. మీరు ఆదరిస్తేనే మేము అడుగు ముందురకి వేస్తాం. దయచేసిన అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడాలని కోరుతున్నాం. ఫెబ్రవరి 14న మా సినిమా రిలీజ్ కావడం మా టీం విజయం. వారి ప్రేమని మర్చిపోలేను. ఈ ప్రయాణంలో గొప్ప సపోర్ట్ ఇచ్చారు. అందరికీ థాంక్ యూ. ఈ సినిమా కథ మెయిన్ హైలెట్. ఒక లవ్ స్టొరీకి నిద్రకి ఏమిటి సబంధం అనేదే ఈ సినిమా. ఈ సినిమా లో మ్యూజిక్ సోల్. అనూప్ అద్భుతమైన ఆమ్ ఇచ్చారు. నాకు ఇంత మంచి కథాబలం వున్న సినిమా ఇచ్చిన డైరెక్టర్ గారికి, నిర్మాతలకు థాంక్ యూ. అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను'అన్నారు.
డైరెక్టర్ ప్రసన్న కుమార్ దేవరపల్లి మాట్లాడుతూ.. ముందుగా నా నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా మొత్తం నిద్ర చుట్టూ ఉటుంది. ఫెబ్రవరి 14న థియేటర్స్ లో వస్తుంది. అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. ఈ సినిమా కోసం అందరం కష్టపడి పని చేశాం, అది మీకు బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి'అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఇది చాలా డిఫరెంట్ కథ.నిద్ర కాన్సెప్ట్ చుట్టూ కథ రన్ అవుతుంది. ప్రసన్న గారు ఆనంద చాలా హార్డ్ వర్క్ చేశారు. వారి కోసం ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment