దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకి లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మహమ్మారి కారణంగా స్మశాన వాటికలు రద్దీగా మారాయి. డెడ్‌బాడీలను ఖననం చేయడానికి ఫ్యామిలీ మెంబర్లు ఇబ్బందులు పడుతున్నారు. అంత్యక్రియల కోసం స్మశాన వాటికల ముందు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మహమ్మారి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను బలి తీసుకుంది.
తాజాగా హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, హీరోయిన్ నిక్కితంబోలి సోదరుడు కరోనా బారినపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన సోదరుడు(29) చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఇటీవల కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశాడని నిక్కి తెలిపింది. ఈ సందర్భంగా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ లేఖని పోస్ట్ చేసింది.
‘ఈరోజు ఉదయం ఆ దేవుడు నీ పేరు పిలవబోతున్నాడని మాకు తెలియదు. జీవితంలో మేము నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాము. కానీ ఇప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళలేదు. మాలో సగభాగాన్ని నీతో తీసుకెళ్ళావు. నువ్వు మాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చావు. నీ ప్రేమ ఎప్పటికీ మాతోనే ఉంటుంది. మేము నిన్ను చూడలేకపోవచ్చు కానీ ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు. నువ్వు వెళ్ళేముందు మాకు వీడ్కోలు చెప్పలేదు. నీకంటూ తెలియక ముందే నువ్వు వెళ్ళిపోయావు. నీన్ను రక్షిస్తుంది అంటే కొన్ని మిలియన్ టైమ్స్, ఎడవడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు ఎప్పటికి మాతోనే ఉంటావు. ఏదో ఒకరోజు మేము నిన్ను మళ్లీ కలుసుకుంటాం. నీలాంటి సోదరుడిని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్.నీ ప్రేమ ఎప్పటికీ మాతోనే ఉంటుంది. నీ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని తన సోదరుడిని ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నిక్కి తంబోలి.
Comments
Please login to add a commentAdd a comment