![Kajal Aggarwal confirms marriage with Gautam Kitchlu - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/19/Kajal-Aggarwal-latest-pictu.jpg.webp?itok=tDE-bW-b)
ఈ నెలాఖరులో పెళ్లి కూతురు కాబోతున్నారు కాజల్ అగర్వాల్. అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లుతో ఆమె వివాహం జరగనుంది. అయితే పెళ్లి తర్వాత పెద్దగా బ్రేక్ తీసుకోకుండా చిన్న హాలిడే మాత్రమే తీసుకుని మళ్లీ పనిలో పడతారట. పెళ్లి తర్వాత కూడా నటిస్తాను అని ఇటీవలే కాజల్ స్పష్టం చేశారు. అన్నట్టుగానే పెద్ద గ్యాప్ లేకుండా షూటింగ్స్‌లో బిజీ కాబోతున్నారామె.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. ఆ షెడ్యూల్‌లో కాజల్ అగర్వాల్ పాల్గొనబోతున్నారని సమాచారం. కాజల్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. తర్వాత చిరంజీవి కూడా ఈ చిత్రీకరణలో జాయిన్ కానున్నారు. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment