హీరోయిన్‌ రిషికా సింగ్‌ కారుకు ప్రమాదం | Rishika Singh Injured Following Car crash | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ రిషికా సింగ్‌ కారుకు ప్రమాదం

Published Fri, Jul 31 2020 9:58 AM | Last Updated on Fri, Jul 31 2020 10:16 AM

Rishika Singh Injured Following Car crash - Sakshi

సాక్షి, బెంగళూరు: కారు ప్రమాదంలో హీరోయిన్‌ రిషికా సింగ్‌ గాయపడ్డారు. రాజానుకుంటె-యలహంక మార్గంలో రిషికా, నటుడు జై జగదీశ్‌ కుమార్తె అర్పిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి యూకలిప్టస్ చెట్టును ఢీకొంది. దీంతో వారిద్దరు గాయపడ్డారు. ఇక కారులో ఉన్న స్నేహితుడు ఆర్య కూడా గాయపడినట్లు సమాచారం. వీరిని హుటాహుటీన నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  వేగాన్ని నియంత్రించలేక పోవడంతో కారు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.  ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని ఆర్య నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగి రెండు రోజులు అయినా కేసు నమోదు కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (చదవండి : శరత్‌కుమార్‌ పేరుతో మోసం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement