![Rrr Movie: Ntr Ram Charan Naatu Naatu Song Creates Record YouTube - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/11/rrr-movie.jpg.webp?itok=GNHdGwIe)
టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియా వైడ్ గా సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ మొదటి సారి కలిసి నటించడం , జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయని చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ఓ పాట ప్రేక్షకులనీ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన 'నాటు నాటు' అనే లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో రికార్డులను బ్రేక్ చేస్తోంది.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి వేసిన స్టెప్పులు ప్రేక్షకులకు, నెటిజన్లకు విపరీతంగా నచ్చాయి. ఈ పాట మాస్ బీట్ తో ఉండటం తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఈ పాట సౌత్ ఇండియా లో టాప్ ప్లేస్ ను చేరుకుంది. అది కూడా ఒక్క రోజులోనే 10.4 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదలైతే రికార్డుల ఎన్ని బ్రేక్ అవుతాయో అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment