ములుగు రూరల్: తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో సెకండ్ గ్రేడ్ టీచర్ల పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన 2024–25 విద్యా సంవత్సరంలో పని చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసి డీఈడీ చేసి ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్లు జిరాక్స్ తీసుకొని హనుమకొండలోని ప్రగతినగర్‌లో గల శ్రీవెంకటేశ్వర బధిరుల పాఠశాలలో వచ్చే నెల 6వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్ 0870–2459374లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment